ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో

Thanu-Radhe-Nenu-Madhu

విడుదల తేదీ : సెప్టెంబరు 14, 2025

స్ట్రీమింగ్‌ వేదిక : ఈటీవీ విన్

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : లక్ష్మీ దుర్గ కతి, జయవంత్ పసుపులేటి, ఋషి కిరణ్, శ్రీధర్ భూమిరెడ్డి
దర్శకుడు : ఆర్ పి పట్నాయక్
నిర్మాణం : గీత భగత్, రఘురాం బొలిశెట్టి
సంగీతం : ఆర్ పి పట్నాయక్
సినిమాటోగ్రఫీ : సుధాకర్ ఎస్ డి కె
ఎడిటింగ్ : వేణు కనుకుల

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ప్రతి వారం లానే ఈ వారం కూడా ఈటీవీ విన్ స్ట్రీమింగ్ యాప్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన కథా సుధా కొత్త ఎపిసోడ్ నే “తను రాధే నేను మధు”. నిజ జీవిత ఘటనలు ఆధారంగా ఆర్ పీ పట్నాయక్ తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

యూఎస్ కి చెందిన ఓ యువ జంట మధు (జయవంత్), రాధే (లక్ష్మి దుర్గ) ఇద్దరూ ఒకరినొకరు ఎంతో గాఢంగా ప్రేమించుకుంటారు. మూడేళ్ళ తమ ప్రేమ జీవితంలో పెళ్లి అనే మాట కూడా రాదు. కానీ ఓ రోజు రాధే మధుని పెళ్లి చేసుకుందాం అని అడుగుతుంది. కానీ కొంత సమయానికే మధు పెళ్ళికి సరే అంటాడు. ఈ హ్యాపీ మూమెంట్ లో ఇద్దరూ ఓ టారో రీడర్ (కార్డ్స్ తో జ్యోతిష్యం చెప్పే) ఒకామెని కలిస్తే ఆమె వారిద్దరూ కలిస్తే మధు ప్రాణానికే ప్రమాదం అని చెప్తుంది. ఆ తర్వాత ఏమైంది? ఆ క్రమంలో మధు తన ప్రేమ కోసం ఓ పాజిటివ్ ప్రయత్నం ఏం చేస్తాడు? ఇద్దరికీ పెళ్లవుతుందా లేదా? నిజంగానే వారి ప్రేమ వల్ల మధుకి ప్రమాదం జరుగుతుందా? చివరికి ఏమైంది అనేది తెలియాలి అంటే ఈ లఘు చిత్రం చూసి తెలుసుకోవాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఈ లఘు చిత్రంలో ఆహ్లాదంగా అనిపించే అంశాలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా నిజ జీవిత ఘటన ఆధారంగా తీసుకున్న లవ్ స్టోరీ దానిపై కథనం ఈ తరహా లవ్ స్టోరీస్ ని ఇష్టపడేవారికి కనెక్ట్ అవుతుంది. యువ జంట రాధే, మధు లుగా జయవంత్, లక్ష్మి దుర్గ పాత్రల్లో ఇమిడిపోయారు.

మంచి కెమిస్ట్రీ నిజ జీవిత కపుల్స్ లా ప్రేమ కనబరిచారు. అంతే రీతిలో మంచి ఎమోషనల్ పెర్ఫామెన్స్ లు కూడా చేశారు. ఇక ఇంకో అంశం సంగీత దర్శకుడు ఆర్ పీ పట్నాయక్ లవ్ సాంగ్స్ కానీ తన వాయిస్ మ్యూజిక్ కి సెపరేట్ క్రేజ్ ఉంది. మళ్ళీ చాలా ఏళ్ళకి తన నుంచి మంచి పాటలు, తన మార్క్ లవ్ ట్యూన్స్ ఈ షార్ట్ ఫిలిం లో కనిపించడం అనేది నోస్టాల్జిక్ గా అనిపిస్తుంది.

వీటితో పాటుగా ఈ ఎపిసోడ్ లో ఒకింత థ్రిల్ చేసే ఎలిమెంట్స్ కూడా కనిపిస్తాయి. మూఢనమ్మకాలు, ఇంకో పక్క సైకలాజికల్ గా చూపించిన సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. అలాగే క్లైమాక్స్ లో ఒక ఎమోషనల్ ట్విస్ట్ అయితే సున్నిత మనస్కులకి బాగా హార్డ్ హిట్టింగ్ గా తగిలే అవకాశం ఉంది.

మైనస్ పాయింట్స్:

ఇది ఎంత రియల్ స్టోరీ ఆధారంగా తీసినప్పటికీ స్లో కథనం అనేది మాత్రం ఉంది. మూమెంట్స్ పికప్ అవ్వడానికి కొంచెం సమయం అయితే పడుతుంది. సో కొంచెం ఫాస్ట్ పేస్డ్ కథనాలు లాంటివి కోరుకునేవారు కొంచెం ఓపిక పట్టాల్సిందే.

అలాగే అక్కడక్కడా చిన్న లాజికల్ ఎర్రర్స్ ఉన్నాయి. వీటిని కరెక్ట్ చేసుకున్నా బాగుండేది తొలగించేసినా సరిపోయేది. ఇవి ఈ ఎపిసోడ్ లో కొంచెం డిజప్పాయింట్ చేస్తాయి.

సాంకేతిక వర్గం:

ఈ ఎపిసోడ్ ని టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ గా డిజైన్ చేసుకోవడం విశేషం. యూఎస్ లొకేషన్స్ లో తెరకెక్కించి మంచి విజువల్స్ ని అందించి ఎక్కడా నిర్మాతలు కాంప్రమైజ్ కాలేదు. ఆర్ పి పట్నాయక్ సంగీతం బాగుంది. పాటలు ఇంకా బాగున్నాయి. సుధాకర్ ఎస్ డి కె మంచి కెమెరా వర్క్ అందించారు. వేణు కనుకుల ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా చేయాల్సింది కానీ బాగానే ఉంది.

తిరుమల నాగ్ డిజైన్ చేసిన స్క్రీన్ ప్లే మెప్పిస్తుంది. ఇక ఆర్ పి పట్నాయక్ దర్శకత్వానికి వస్తే ఎన్నో ప్రేమ కథలకి మంచి సంగీతం అందించిన తాను దర్శకునిగా, సంగీత దర్శకునిగా మంచి న్యాయం చేకూర్చారని చెప్పవచ్చు. యువ జంటని వారిపై లవ్ మూమెంట్స్ ని బాగా తెరకెక్కించారు. అలాగే ఇతర కీలక అంశాలు కూడా మంచి సెటప్ తో ప్లాన్ చేసి తెరకెక్కించడం బాగుంది. కొంచెం స్లో కథనం పక్కన పెడితే తన వర్క్ బాగుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘తను రాధే నేను మధు’ ఎపిసోడ్ ఈటీవీ విన్ నుంచి మెప్పిస్తుంది అని చెప్పవచ్చు. కొంచెం స్లో కథనం పక్కన పెడితే ఈ ఎపిసోడ్ లో లవ్ మూమెంట్స్, మంచి ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్ ఎలిమెంట్స్, ఆర్ పి పట్నాయక్ వర్క్ లు బాగున్నాయి. సో ఈ ఎపిసోడ్ ని ఈటీవీ విన్ లో ట్రై చేయండి.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

Exit mobile version