ఓటిటి సమీక్ష: ‘ఫరెవర్’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో

forever

విడుదల తేదీ : సెప్టెంబరు 21, 2025

స్ట్రీమింగ్‌ వేదిక : ఈటీవీ విన్

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : అభిరాం, యాషిలా, పరుచూరి వేణు, స్వాతి శ్రీ తదితరులు
దర్శకత్వం : ఆర్ విశ్వనాథన్
నిర్మాణం : త్రివేద్ పిక్చర్స్
సంగీతం : ప్రవీణ్ శ్రీరామ్
సినిమాటోగ్రఫీ : భాను ప్రకాష్
ఎడిటింగ్ : పిట్టల సాయి కుమార్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ప్రతీ వారం లానే ఈ వారం కూడా మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ నుంచి స్ట్రీమింగ్ కి వచ్చిన కథా సుధ కొత్త ఎపిసోడ్ నే “ఫరెవర్”. మరి ఈ లఘు చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

11 ఏళ్ళు నుంచి ప్రేమించుకుంటున్న యువ జంట సూర్య (అభిరాం),
పల్లవి (యాషిలా) లు తమ ఇంట్లో పెద్దలని ఒప్పించి తమ ప్రేమ పెళ్లి చేసుకోవాలని చూస్తారు. ఇలా సూర్య తన తండ్రి ఆనంద్ (పరుచూరి వేణు) ని పల్లవి తల్లి మహాలక్ష్మి (స్వాతి శ్రీ) లు కలిసి వారి ప్రేమ కోసం మాట్లాడుతారు. అయితే ఆ సమయంలో ఆనంద్ కి పల్లవి తల్లి ఎవరో కాదు తాను యుక్త వయస్సులో ప్రేమించిన అమ్మాయి అని గుర్తు పడతాడు. మరి ఈ క్లిష్టతర పరిస్థితి ఎలా సాల్వ్ అయ్యింది? తన ప్రేయసి మళ్ళీ తన జీవితంలోకి రావడం ఇంకోపక్క పిల్లల ప్రేమ, చివరికి ఏమైంది అనేది తెలియాలి అంటే ఈ ఎపిసోడ్ ని చూడాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ లఘు చిత్రంలో మంచి ప్రేమ కథని కొంచెం రియలిస్టిక్ గా చాలా మంది మనసుల లోతుల్లో ఉండే అభిప్రాయాన్ని ప్రతిబింబించేలా తెరకెక్కించారు అని అని చెప్పొచ్చు. మేజర్ గా చెప్పాలనుకున్న ప్రేమ కథని నీట్ గా దర్శకుడు ఇందులో ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది.

ప్రేమలో నిజాయితీగా బలంగా ఏదన్నా కోరుకుంటే కొంత సమయం పట్టినా అది నెరవేరుతుంది అనే అంశాన్ని మంచి మాటలతో ఆకట్టుకునే మూమెంట్స్ తో ప్రెజెంట్ చేయడం మంచి ప్రేమ కథలు లేదా లవ్ ఫెయిల్యూర్స్ లాంటి వాటిని ఇష్టపడేవారికి మనసు అనిపించేలా ఈ ఎపిసోడ్ చేస్తుంది.

పరుచూరి వేణు, స్వాతి శ్రీలు ఎపిసోడ్ ముగింపు ముందు మాట్లాడుకునే మాటలు ప్రేమ కోసం అందులో వ్యత్యాసాలు వంటివి ఇంప్రెస్ చేస్తాయి. ఇక నటీనటుల్లో యువ నటులు తమ పాత్రలు పరిధి మేరకు కనిపించి బాగా చేశారు. ఇక వీరు కాకుండా సీనియర్ నటులుగా కనిపించిన వేణు, స్వాతిలు వారి ఫ్లాష్ బ్యాక్ నటులు తమ పాత్రలకి ప్రాణం పోశారు. చాలా పరిపక్వత కలిగిన నటన వారు చూపించారు.

మైనస్ పాయింట్స్:

ఈ ఎపిసోడ్ చాలా సింపుల్ గానే కనిపిస్తుంది. మేజర్ గా టర్నింగ్ లు ఆసక్తిగొల్పే కథనం లాంటివి పెద్దగా ఉండవు. అలా క్లీన్ గా సాగిపోతుంది. ఈ క్రమంలోనే మూమెంట్స్ ఒకింత స్లోగా అనిపిస్తాయి. కొంచెం ఫాస్ట్ పేస్డ్ నరేషన్ ని ప్లాన్ చేసుకోవాల్సింది.

అలాగే కొంతమేర కథనం ఇదే కథా సుధలో ఇంద్రజ నటించిన ఓ ఎపిసోడ్ ని తలపిస్తుంది. ఒక లవ్ స్టోరీ అందులో పెద్దలు రిలేషన్ పాయింట్ కొంచెం అలా అనిపిస్తుంది కానీ తర్వాత దానిపై క్లారిటీ బయటకి వస్తుంది. సో కొత్తగా చూసే వారికి ఇది మొదట ఒకింత ఎబ్బెట్టుగా అనిపించవచ్చు. వీటితో ఈ అంశాలు కొంచెం డౌన్ చేసాయి అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రానికి సాంకేతిక విభాగం తాలూకా పనితనం బాగుంది. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పై ఒక గమనిక ఇచ్చినప్పటికీ ఆ పోర్షన్స్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం బాగుంది. మ్యూజిక్, కెమెరా వర్క్ లు బాగున్నాయి. అలాగే డైలాగ్స్ ని బాగా రాసుకున్నారు. ఎడిటింగ్ కొంచెం ఫాస్ట్ గా చేయాల్సింది.

ఇక దర్శకుడు ఆర్ విశ్వనాథన్ విషయానికి వస్తే.. తన వర్క్ ఈ లఘు చిత్రానికి డీసెంట్ గా ఉంది. ముందు కొంచెం రెగ్యులర్ గా అనిపించినా చివరికి తన పనితనం స్క్రీన్ ప్లే కన్విన్సింగ్ గా అనిపిస్తుంది. నటీనటుల ఎంపిక కూడా బాగుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘ఫరెవర్’ లఘు చిత్రంలో లవ్ ఎమోషన్ మెప్పిస్తుంది. ముఖ్యంగా ఆనంద్, మహాలక్ష్మిల లవ్ ట్రాక్ బాగుంది. వారి లవ్ ట్రాక్ లో ఒక నిజాయితీ కూడా కనిపిస్తుంది. వారి నడుమ డైలాగ్స్, ఆ క్లారిటీలు ఈ తరహా లవ్ స్టోరీలు ఇష్టపడేవారిని మెప్పిస్తాయి. కాకపోతే స్లోగా సాగే కథనం మరీ కొత్తదనం లాంటివి కోరుకునేవారికి మెప్పించకపోవచ్చు. ఒక క్లీన్, డీసెంట్ లవ్ స్టోరీ చూడాలి అనుకుంటే ఈ లఘు చిత్రాన్ని చూడొచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

Exit mobile version