ఒక్క దేశం ఓకే రోజు 930 కోట్లకి పైగా గ్రాస్.. బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న లేటెస్ట్ సినిమా

ఒక్క దేశం ఓకే రోజు 930 కోట్లకి పైగా గ్రాస్.. బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న లేటెస్ట్ సినిమా

Published on Nov 30, 2025 8:01 PM IST

zootopia

ఒకోసారి కొన్ని కొన్ని సినిమాల వసూళ్లు వింటే సినిమాల కోసం బాగా తెలిసిన వారికి కూడా ఒకింత షాకింగ్ గా అనిపిస్తుంది. చాలామంది ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర భారీ గ్రాఫిక్స్, భారీ యాక్షన్ లేదా మోషన్ కాప్చర్ లాంటి సినిమాలు రికార్డు వసూళ్లు లాంటివి కొల్లగొడతాయి. కానీ చాలా మందికి సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే వీటిని మించి యానిమేషన్ సినిమాలు వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర ఊహించని నంబర్స్ చేసినవి కూడా ఉన్నాయి.

ఈ ఏడాదిలోనే చైనాకి చెందిన ‘నే జాహ్’ అనే యానిమేషన్ సినిమా ఏకంగా 2 బిలియన్ డాలర్స్ కి పైగా రాబట్టింది. అంటే ఇది అవతార్ 2 రేంజ్ వసూళ్లు. దీని బట్టి యానిమేషన్ సినిమాల హవా ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక మరో యానిమేషన్ సినిమా వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సెట్ చేస్తుంది. ఆ సినిమానే ‘జూటోపియా 2’.

హాలీవుడ్ కి చెందిన ఈ సినిమా కేవలం చైనా లోనే ఒక్క రోజులో 104 మిలియన్ డాలర్స్ కి పైగా రాబట్టిందట. అంటే ఇది మన కరెన్సీలో ఏకంగా 930 కోట్లకి పైగా వసూళ్లు. అంతే కాకుండా చైనా మార్కెట్ లో ఇది కేవలం ఒక్కరోజు వసూళ్లే కాకుండా అవెంజర్స్ ఎండ్ గేమ్ డే 1 రికార్డు గ్రాస్ ని క్రాస్ చేసి కొత్త రికార్డు సెట్ చేసినట్టు తెలుస్తుంది. ఇదంతా కేవలం ఒక యానిమేషన్ సినిమా చేయడం విశేషం. దర్శకులు జేరెడ్ బుష్ అలాగే బైరన్ హోవార్డ్ లు తెరకెక్కించిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఇంకెన్ని సంచనాలు సెట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు