జాంబీ రెడ్డి.. ఈసారి ఇంటర్నేషనల్..!

తెలుగులో జాంబీ కాన్సెప్ట్‌ను పరిచయం చేసిన చిత్రాలలో ‘జాంబీ రెడ్డి’ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కరోనా కాలంలో రాయలసీమ నేపథ్యంలో సటైరికల్ టచ్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది.

ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ రానుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ మళ్లీ హీరో తేజ సజ్జాతో జతకట్టి ‘జాంబీ రెడ్డి 2’ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

పాన్-ఇండియా స్థాయిలో తేజ సజ్జా క్రేజ్ పెరిగిన నేపథ్యంలో, ఈసారి సినిమా జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తున్నారని మేకర్స్ చెబుతున్నారు. “సెకండ్ పార్ట్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఉంటుంది. సరదా మాత్రం తగ్గదు. ఇప్పటివరకు మనం విదేశీ జాంబీ సినిమాలు చూశాం. ఇకపై మనమే ప్రపంచానికి ఒక తెలుగు జాంబీ సినిమా చూపించబోతున్నాం’ అని తేజ సజ్జా మిరాయ్ ప్రమోషన్స్‌లో భాగంగా తెలిపాడు.

Exit mobile version