అఫీషియల్: “మహాకాళీ” గా కింగ్డమ్ నటి

యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సెన్సేషనల్ హిట్ హను మాన్ తర్వాత తన సినిమాటిక్ యూనివర్స్ ని ఆ సినిమా తోనే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఆ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిస్తున్న లేడీ ఓరియెంటెడ్ సూపర్ హీరో చిత్రమే “మహా కాళీ”.

దర్శకురాలు పూజా కొల్లూరు తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ ఇంకా మహా కాళీ గా ఎవరు కనిపిస్తారు అనేది రివీల్ చేసారు. ఒక ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో కన్నడ నటి రీసెంట్ గా కింగ్డమ్ లో కనిపించిన నటి భూమి శెట్టి నటిస్తున్నట్టు రివీల్ చేశారు.

దీనితో ఈ సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాని టేకోవర్ చేసింది. ఇక ఈ సినిమా పనులు శరవేగంగా కొనసాగుతుండగా త్వరలోనే మరిన్ని డీటెయిల్స్ బయటకి రానున్నాయి.

Exit mobile version