ఇటీవల పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ గా మారిన అనౌన్స్మెంట్ ఏదన్నా ఉంది అంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ అలాగే దర్శకుడు సందీప్ రెడ్డి వంగల స్పిరిట్ సినిమా ఆడియో టీజర్ అని చెప్పాలి. ఇది వచ్చాక మరోసారి స్పిరిట్ టాక్ ఆఫ్ ది నేషన్ అయ్యింది. అయితే ఈ సినిమా పరంగా ఎప్పుడు నుంచో అందరినీ ఎంతో ఎగ్జైట్ చేస్తున్న మరో అంశమే కొరియన్ బాలయ్య డాన్ లీ ప్రెజెన్స్ కోసం.
ఈ స్టార్ నటుడు స్పిరిట్ లో ఉన్నట్టుగా క్రేజీ టాక్ ఆ మధ్య వైరల్ అయ్యింది. అయితే దాదాపు ఈ నటుడు ఉన్నాడనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. మరి లేటెస్ట్ గా మళ్లీ ఈ టాక్ ఊపందుకుంది. కానీ ఈసారి కొరియన్ సోషల్ మీడియా కూడా చెప్తుండడంతో ఫ్యాన్స్ లో ఆశలు మరింత ఎక్కువ అవుతున్నాయి. మరి ఈ సెన్సేషనల్ కలయికపై ఆ ఒక్క అఫీషియల్ అప్డేట్ వచ్చేస్తే మాత్రం అది పాన్ వరల్డ్ లెవెల్ కి రీచ్ అయిపోయినట్టే అని చెప్పవచ్చు.
