లేటెస్ట్ గా దీపావళి కానుకగా థియేటర్స్ లో అలరించడానికి వచ్చిన చిత్రమే డ్యూడ్. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా మామితా బైజు ఇంకా నేహా శెట్టి హీరోయిన్స్ గా దర్శకుడు కీర్తిశ్వరన్ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి ప్రదీప్ కెరీర్ లో హ్యాట్రిక్ 100 కోట్ల గ్రాసర్ గా నిలిచింది.
ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ అయినట్టు టాక్ ఇపుడు వినిపిస్తోంది. దీని ప్రకారం ఈ నవంబర్ 14 నుంచి నెట్ ఫ్లిక్స్ పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమాను తీసుకొచ్చే ఛాన్స్ ఉందట. మరి ఈ సినిమా డేట్ పై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి సాయి అభ్యంకర్ సంగీతం అందించాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ మరో హిట్ గా కోలీవుడ్ లో అందుకున్నారు.
