సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో చేస్తున్న సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం జైలర్ 2 కోసం అందరికీ తెలిసిందే. రజినీకాంత్ అభిమానులు మంచి ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే కాస్టింగ్ పరంగా మొదటి పార్ట్ లోనే చాలామంది కనిపించారు.
ఇక పార్ట్ 2 లో కూడా అంతే కేర్ తో నెల్సన్ ప్లాన్ చేస్తున్నాడు. ఆల్రెడీ పార్ట్ 1 లో కమెడియన్ యోగిబాబుతో సీన్స్ ఎలా వర్కవుట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇక పార్ట్ 2 లో తనతో పాటుగా మరో స్టార్ కమెడియన్ సంతానం కూడా ఇప్పుడు ఎంటర్ అయినట్లు తెలుస్తోంది.
లేటెస్ట్ షెడ్యూల్ లోనే సంతానం సెట్స్ లో జాయిన్ అయ్యారట. ఇక సినిమాలో నెల్సన్ మార్క్ సాలిడ్ ఫన్ మరింత డోస్ లో గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
