“జాంబీ రెడ్డి” రెండు రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.!

“జాంబీ రెడ్డి” రెండు రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.!

Published on Feb 7, 2021 3:00 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కించిన మరి ఇంట్రెస్టింగ్ అటెంప్ట్ చిత్రం “జాంబీ రెడ్డి”. యువ హీరో తేజ సజ్జ మెయిన్ లీడ్ లో ఆనంది హీరోయిన్ గా మన తెలుగులో మొట్ట మొదటగా చేసిన ఈ ప్రయోగంకు ప్రేక్షకులు మంచి ఆదరణనే ఇస్తున్నారు. మరి అలా ఇప్పుడు ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన రెండు రోజుల గ్రాస్ లెక్కలను మేకర్స్ బయట పెట్టారు.

ఈ చిత్రానికి రెండు రోజులకు కలిపి 4.63 కోట్లు గ్రాస్ వచ్చిందట. అలాగే 2 కోట్లకు పైగా షేర్ ఈ చిత్రం రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి మాత్రం ఈ చిత్రం రెండు రోజులూ డీసెంట్ హోల్డ్ కనబరిచింది అని చెప్పాలి. అలాగే ఈ వీకెండ్ లో కూడా ఇదే హోల్డ్ కనబరుస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు. మరి సోమవారం నుంచి ఎలాంటి వసూళ్లు వస్తాయో అన్నది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు