హైదరాబాద్లో రామ్ చరణ్ “జంజీర్” రీమేక్ షూటింగ్

హైదరాబాద్లో రామ్ చరణ్ “జంజీర్” రీమేక్ షూటింగ్

Published on Nov 17, 2012 5:04 PM IST

“జంజీర్” చిత్ర రీమేక్ ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటుంది మరో రెండు వారాల పాటు ఇక్కడ ఈ చిత్రం చిత్రీకరణ జరగనుంది. రామ్ చరణ్ ఈ చిత్రంతో బాలీవుడ్లో పరిచయం కానున్నారు. ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగులో కూడా చిత్రీకరిస్తున్నారు. కొద్ది నెలల క్రితమే ఈ చిత్ర చిత్రీకరణ మొదలయినా ప్రియాంక చోప్రా చిత్రీకరణలో పాల్గొనలేదు ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ మరియు ప్రియాంకల మధ్య కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. సోను సూద్, ప్రకాష్ రాజ్ మరియు మహి గిల్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అపూర్వ లఖియ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్ర మాతృక అమితాబ్ బచ్చన్ నటించిన “జంజీర్” ఇందులో అమితాబ్ బచ్చన్ పాత్రలో రామ్ చరణ్ కనిపించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 2013 మేలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు