ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రీకరణ పూర్తి

ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రీకరణ పూర్తి

Published on Nov 17, 2012 1:39 AM IST


నాని మరియు సమంత ప్రధాన పాత్రలలో రానున్న “ఎటో వెళ్లిపోయింది మనసు” చిత్రం ఈరోజు ప్రధాన భాగ చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకుంది. గౌతం మీనన్ దర్శకత్వంవహిస్తున్న ఈ చిత్రం తెలుగు వెర్షన్ తేజ సినిమా బ్యానర్ మీద సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఒక పాటను ఈ మధ్యనే చిత్రీకరించారు. “ఈరోజుతో చిత్రీకరణ ముగిసింది, మరో నెలలో మీ ముందుకి వరుణ్ మరియు నిత్యలు రానున్నారు” అని నాని ట్విట్టర్లో చెప్పారు. ఇళయరాజా అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకాదరణ పొందింది ఎం ఎస్ ప్రభు సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రం తెలుగు మరియు తమిళంలో ఒకేసారి తెరకెక్కించారు. ఈ చిత్రం తెలుగు మరియు తమిళంలో 14న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు