ఆ సినిమా నాకొక చాలెంజ్ – సమంత

ఆ సినిమా నాకొక చాలెంజ్ – సమంత

Published on Nov 21, 2012 4:57 PM IST


చెన్నై ముద్దుగుమ్మ సమంత మరియు ఆమె ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ‘ఏటో వెళ్ళిపోయింది మనసు’. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఒక చాలెంజ్ గా తీసుకొని చేసానని సమంత చెప్పారు. ఈ సినిమాని తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకేసారి షూట్ చేసారు. రెండు భాషల్లోనూ సమంత హీరోయిన్ కాగా తెలుగులో నాని మరియు తమిళంలో జీవా హీరోలుగా నటించారు.

‘ ఈ సినిమాని నేను ఒక చాలెంజ్ గా తీసుకొని చేసాను. ప్రతి సీన్ ని నాని మరియు జీవాలు వారికి తగ్గట్టు చేస్తారు నేను, వారికి తగ్గట్టుగా నా హావ భావాలు మార్చాలి. ఇచ్చిన సన్నివేశానికి మరియు వారికి తగ్గట్టుగా చేయడం కోసం ప్రతి సీన్ ని నేను రెండు రకాలుగా చేయాలి. అలా చేయడం చాలా కష్టమైన పని’ అని సమంత అన్నారు. అలాగే గౌతమ్ మీనన్ మేకింగ్ చాలా బాగుంటుంది మరియు టాలెంటెడ్ డైరెక్టర్ అని ఆమె అంది. డిసెంబర్లో విడుదల కానున్న ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.

తాజా వార్తలు