మెగాఫోన్ పట్టుకోనున్న మరో మ్యూజిక్ డైరెక్టర్

మెగాఫోన్ పట్టుకోనున్న మరో మ్యూజిక్ డైరెక్టర్

Published on Nov 19, 2012 12:00 PM IST


ఇటీవల కాలంలో ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఇతర విభాగాలకు చెందిన ప్రముఖులు వారు చేస్తున్న పనిని పక్కన పెట్టి వేరే డిపార్ట్మెంట్ లపై ఆసక్తి చూపుతున్నారు., ఉదాహరణకి డైరెక్షన్, యాక్టింగ్ మొదలైనవి. ఇటీవలే మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంథోని ‘నాన్’ అనే తమిళ సినిమాతో హీరోగా మారారు. మాస్ట్రో ఇళయరాజా సంగీతానికి వారసుడిగా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన యువన్ శంకర్ రాజా కూడా త్వరలోనే మ్యూజిక్ ని పక్కనపెట్టి మెగా ఫోన్ పట్టుకోనున్నారు. ‘ నేను డైరెక్ట్ చేయాలనుకుంటున్న సినిమాకి కథ రెడీ కాగా ఇంకా చిన్న చిన్న కొస మెరుగులు మిగులున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తానని’ యువన్ అన్నాడు. ఇది పక్కన పెడితే ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో కార్తీ హీరోగా నటిస్తున్న ‘బిర్యాని’ సినిమాకి యువన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాతో యువన్ 100 సినిమాలకు సంగీతం అందించిన అతి తక్కువ సంగీత దర్శకుల లిస్టులో చేరనున్నారు. ఇప్పటివరకూ తన మ్యూజిక్ తో సౌత్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకున్న యువన్ తన డైరెక్షన్ తో ఎంత వరకూ ఆకట్టుకుంటాడో చూడాలి మరి.

తాజా వార్తలు