యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. అయితే ఈ చిత్రంలో అల్లూరిగా రామ్ చరణ్ నటిస్తుండగా కొమరం భీం గా కనిపిస్తున్నారు. ఇప్పటికే అల్లూరి టీజర్ గా నటించగా దాని టీజర్ తో చరణ్ సెపరేట్ రికార్డులు సెట్ చెయ్యగా భీం టీజర్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భీం టీజర్ తో మరిన్ని నెవర్ బిఫోర్ రికార్డులు సెట్ చేసాడు.
టాలీవుడ్ లో మొట్ట మొదటి 1 మిలియన్ లైక్స్ సాధ్హించిన టీజర్ గానే కాకుండా మొట్ట మొదటి లక్ష కామెంట్స్ సంపాదించిన టీజర్ గా మరో ఫస్ట్ ఎవర్ రికార్డుగా సెట్ చేసింది. అలాగే దీనితో పాటుగా ఇప్పుడు 30 మిలియన్ వ్యూస్ మార్క్ ను క్రాస్ చేసి మన టాలీవుడ్ ల ఫాస్టెస్ట్ 30 మిలియన్ వ్యూస్ సాధించిన టీజర్ గా మరో రికార్డు సెట్ చేసింది. దీనితో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఖాతాలో మరో సెన్సేషనల్ రికార్డు వచ్చి పడింది. ఈ చిత్రంలో తారక్ సరసన ఒలీవియా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.