స్టార్ హీరోల డైలాగ్స్ కి యంగ్ హీరోల యాక్షన్ !

స్టార్ హీరోల డైలాగ్స్ కి యంగ్ హీరోల యాక్షన్ !

Published on May 18, 2020 8:00 AM IST

కరోనా లాక్‌ డౌన్ తో ఇంట్లోనే ఉండిపోవాల్సిన పరిష్టితి. అయితే ప్రేక్షకుల కోసం టాలీవుడ్ ప్రముఖులు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆడియన్స్ ను మెప్పించడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో యంగ్ హీరోలు రాహుల్ విజయ్, ఆకాష్ పూరి కలిసి పూరి డైలాగ్ లకి యాక్షన్ చేస్తూ ఒక వీడియో చేశారు.

రాహుల్ విజయ్, ఆకాష్ పూరీకి ఫోన్ చేయడంతో మొదలైన ఈ వీడియో పూరి సినిమాల్లోని ఫేమస్ డైలాగులతోనే సాగుతుంది. ‘బుజ్జిగాడు’లోని ప్రభాస్ చెప్పే ‘ఏండి.. ఏమైనా మాట్లాడండి’ డైలాగుతో స్టార్ట్ అయి పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్, నాగార్జున, మహేష్ బాబు, అల్లు అర్జున్, గోపీచంద్, రామ్, బాలయ్య, ఎన్టీఆర్, ఫైనల్ గా ‘ఖడ్గం’లో రవితేజ చెప్పే ‘ఒకే ఒక్క ఛాన్స్’ అనే డైలాగ్ తో ఈ వీడియో ముగుస్తోంది. .

మొత్తానికి పూరి సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో.. పూరి డైలాగ్స్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటాయో ఈ వీడియో మరోసారి గుర్తు చేసింది. వీడియోలో డైలాగులు బాగా పేలాయి. అలాగే రాహుల్, ఆకాష్ పూరి హావభావాలు కూడా ఆకట్టుకున్నాయి,

సంబంధిత సమాచారం

తాజా వార్తలు