పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు మారుతి హారర్ కామెడీ చిత్రంగా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా నుంచి టీజర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఆద్యంతం థ్రిల్లింగ్ అంశాలతో ఉండటం.. డార్లింగ్ ప్రభాస్ తనదైన పర్ఫార్మెన్స్ చేస్తూ కనిపించడంతో ఈ టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ దక్కింది.
ఇక ఈ టీజర్ రిలీజ్ అయిన 24 గంటల్లో యూట్యూబ్‌లో ఏకంగా 59 మిలియన్లకు పైగా వ్యూ్స్ దక్కించుకుంది. ఇంత భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకున్న రాజాసాబ్ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులను ప్రభాస్ తిరగరాయడం ఖాయమని అభిమానులతో పాటు చిత్ర యూనిట్ కూడా ధీమా వ్యక్తం చేస్తుంది.
ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్స్‌తో కనిపిస్తున్నాడు. అందాల భామలు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.