టాలీవుడ్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టులలో దర్శకుడు పూరి జగన్నాధ్, తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కలిసి చేయనున్న సినిమా కూడా ఒకటి. పూరి-సేతుపతి అనే ట్యాగ్‌తో ఈ చిత్ర ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు.
ఈ సినిమాలో అందాల భామ సంయుక్త మీనన్ కూడా నటిస్తుందని.. ఆమె పాత్ర ఈ సినిమాలో కీలకంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు ఇప్పటికే నటి టబు, నటుడు దునియా విజయ్ నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఇప్పుడు సంయుక్త కూడా ఈ సినిమాలో జాయిన్ కావడంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.
ప్రస్తుతం సంయుక్త పలు చిత్రాల్లో నటిస్తోంది. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ-2’లో కూడా సంయుక్త నటిస్తుండటంతో ఈ బ్యూటీ వరుస ఆఫర్స్‌తో బిజీ అయింది. ఇక పూరి-సేతుపతి చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది.