‘సింధూర సంజీవని’ పేరిట మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్లాన్ చేసిన జెట్టి హీరో

‘సింధూర సంజీవని’ పేరిట మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్లాన్ చేసిన జెట్టి హీరో

Published on Jun 28, 2025 8:00 AM IST

టాలీవుడ్ కి జెట్టి సినిమాతో హీరోగా సుపరిచితులైన కృష్ణ మానినేని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా విజయవాడ వరదల సమయంలో హీరో కృష్ణ చేసిన సేవా కార్యక్రమాలు ప్రశంసలు అందుకున్నారు.

అటువంటి కృష్ణ ఈ జూన్ 14 ఇంటర్నేషనల్ బ్లడ్ డొనేషన్ డే ను పురస్కరించుకొని “సింధూర సంజీవని” పేరిట ప్రతి ఏటా జూన్ లో తన ఫ్రెండ్స్ తో బ్లడ్ డొనేషన్ చేయడానికి సంకల్పించారు. ఆ క్రమంలో భాగంగా జూన్ 29 (రేపు) చిరంజీవి బ్లడ్ బ్యాంకులో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించనున్నారు. తనతోపాటు మరో పదిమంది యువత బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పాల్గొనాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు