తెలుగు సినిమా దగ్గర ఓకే డేట్ లో రెండు సినిమాలు రావడం అనేది ఎప్పుడూ కొత్త కాదు. అయితే ఒకే డేట్ లో ఎలాంటి సినిమాలు వస్తున్నాయి అనేది ముఖ్యం. ఇలా వచ్చే ఏడాది భారీ క్లాష్ కి ఆల్రెడీ కొన్ని చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే వాటిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం పెద్ది అలాగే నాచురల్ స్టార్ నాని నటిస్తున్న ది ప్యారడైజ్ చిత్రాలు ఉన్నాయి.
ఒక్కరోజు తేడాతో రెండు సినిమాలు క్లాష్ అవ్వనుండగా ఆ మధ్య ది ప్యారడైజ్ మాత్రం వాయిదా పడుతుంది అని పెద్ది సినిమా సోలో రిలీజ్ గా వస్తుంది అని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు ట్విస్ట్ ఏమిటంటే ఈ రెండు సినిమాల నడుమ క్లాష్ ఆగిపోలేదు. నాని లేటెస్ట్ గానే సినిమా సెట్స్ లోకి అడుగు పెట్టినట్టు ఒక మాసివ్ స్టిల్ తో మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇవ్వడమే కాకుండా 2026 మార్చ్ 26నే సినిమా వస్తుంది అంటూ కన్ఫర్మ్ చేశారు.
దీనితో ఈ రెండు సినిమాల క్లాష్ ఇంకా ఆన్ లోనే ఉందని చెప్పాలి. ఇక పెద్ది సినిమాని బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుండగా వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ది ప్యారడైజ్ ని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తుండగా ఎస్ ఎల్ వి సినిమాస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.
THE DHAGAD joins#TheParadise ❤????
Natural Star @NameisNani joins the sets of #TheParadise today.
Few important sequences related to childhood portions were shot last week.#THEPARADISE in CINEMAS ???????????????? ????????????????????, ????????????????.
Releasing in Telugu, Hindi, Tamil, Kannada,… pic.twitter.com/5vP01Dkgfr— SLV Cinemas (@SLVCinemasOffl) June 28, 2025