ఓటిటి సమీక్ష: ‘విరాటపాలెం-పీసీ మీనా రిపోర్టింగ్’ – తెలుగు సిరీస్ జీ5లో

ఓటిటి సమీక్ష: ‘విరాటపాలెం-పీసీ మీనా రిపోర్టింగ్’ – తెలుగు సిరీస్ జీ5లో

Published on Jun 28, 2025 3:22 PM IST

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : జూన్ 27, 2025
స్ట్రీమింగ్‌ వేదిక : జీ5

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

నటీనటులు : అభిజ్ఞ వూతలూరు, చరణ్ లక్కరాజు, లావణ్య సాహుకార, రామరాజు, గౌతమ్ రాజు, సతీష్ మరియు ఇతరులు
దర్శకుడు : పోలూరు కృష్ణ
నిర్మాత : కేవీ శ్రీరామ్
సంగీత దర్శకుడు : రోహిత్ కుమార్
సినిమాటోగ్రాఫర్ : మహేష్ కె స్వరూప్
ఎడిటర్ : చంద్రశేఖర్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ఈ వారం థియేటర్స్ సహా ఓటిటిలో కూడా పలు కంటెంట్ ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చాయి. అలా వచ్చిన లేటెస్ట్ సిరీస్ నే ‘విరాటపాలెం – పీసీ మీనా రిపోర్టింగ్’. మరి ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

1980 ల సమయంలో విరాటపాలెం అనే గ్రామంలో తన పెళ్లి సమయంలోనే ఒక వధువు అనుమానాస్పదంగా చనిపోతుంది. ఇదే తరహాలో మరో దశాబ్దం తర్వాత మరో నూతన వధువు చనిపోతుంది. దీనితో విరాటపాలెం గ్రామస్తులు తమ ఊరికి ఏదో శాపం తగిలింది అని అనుకుంటారు. ఈ క్రమంలో పోలీస్ కానిస్టేబుల్ మీనాక్షి (అభిజ్ఞ వూతలూరు) అక్కడికే ట్రాన్స్ఫర్ అయ్యి వస్తుంది. ఇక అక్కడ నుంచి మొదలైన ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటి? అది నిజంగా శాపమా లేక నిజంగానే ఎవరైనా దీని వెనుక ఉన్నారా? మీనా వీటిని ఎలా కనుక్కుంటుంది అనేది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్:

ఈ సిరీస్ లో నటి అభిజ్ఞ చేసిన సీరియస్ రోల్ లో బాగా చేసింది అని చెప్పొచ్చు. డిజిటల్ ప్లాట్ ఫామ్ వ్యూవర్స్ కి ఆమె బాగానే తెలుసు. కానీ ఇందులో కొంచెం సీరియస్ రోల్ లో కనిపించి పర్వాలేదనిపిస్తుంది.

ఉన్న నెగిటివ్ అంశాల్లో ఈమె కొంచెం పాజిటివ్ అనిపిస్తుంది. ఇంకో మంచి విషయం ఏదన్నా ఉంది అంటే అది సిరీస్ లో ఎపిసోడ్స్ ని షార్ట్ గా కట్ చేసుకున్నారు. 25 నిముషాలు అలా పెట్టుకున్న ఎపిసోడ్స్ పరంగా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు.

మైనస్ పాయింట్స్:

ఈ సిరీస్ లో బాగున్న అంశాల కంటే బాలేని అంశాలే ఎక్కువగా కనిపిస్తాయి. నిజానికి వీటిలోని మంచి అంశాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఈ సిరీస్ ది. ఒక్క అభిజ్ఞ అంశం పక్కన పెడితే మిగతా అన్ని అంశాల్లో కూడా ఈ సిరీస్ డిజప్పాయింట్ చేస్తుందని చెప్పక తప్పదు. కాన్సెప్ట్ ఓకే కానీ దీనిని నడిపించిన విధానం అనేది వరస్ట్ అని చెప్పవచ్చు.

ఏ కోశానా కూడా ఈ సిరీస్ ఎంగేజింగ్ గా అనిపించదు. ఒకో ఎపిసోడ్ చిన్నదే కానీ కేవలం నాలుగు ఎపిసోడ్స్ లో ఈపించే రేంజ్ కంటెంట్ ని వీళ్ళు ఏకంగా 7 ఎపిసోడ్స్ మేర సాగదీశారు. ఎక్కడా డెప్త్ లేకుండా, సరైన ఎమోషన్స్ లేకుండా చాలా పేలవమైన నరేషన్ తో సాగింది.

పోనీ సిరీస్ లో సెటప్ అయినా ఏమన్నా బాగుందా అంటే చాలా నాసిరకం విజువల్స్ ఈ సిరీస్ లో కనిపిస్తాయి. లైన్ తగ్గట్టుగా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే దారుణంగా మిస్ అయ్యింది. నటీనటులు నీరసంగా కనిపిస్తారు.

ఇక విజువల్ ఎఫెక్ట్స్ అయితే ఇంకా దారుణం అని చెప్పొచ్చు. దీనికంటే బెటర్ అవుట్ పుట్ ఉన్న సిరీస్ లు చాలా కనిపిస్తాయి. ఇక వీటితో పాటుగా సురభి ప్రభావతి, లావణ్య లాంటి ఇతర నటుల పెర్ఫామెన్స్ లు స్కోప్ లేని పాత్రల్లో వేస్ట్ అయ్యాయి.

సాంకేతిక వర్గం:

టెక్నీకల్ గా ఈ సిరీస్ ఫెయిల్యూర్ అనే చెప్పాలి. కంటెంట్ పరంగా ఎలా ఉన్నప్పటికీ ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు దారుణంగా ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ నుంచి నేపథ్య సంగీతం వరకు ఏ అంశం కూడా ఆకట్టుకోదు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కామెడీగా ఉంటుంది. ఇక దర్శకుడు పోలూరు కృష్ణ విషయానికి వస్తే.. తాను కావాలనే ఇలా తీయాలి అనుకున్నారో ఏమో కానీ చాలా వరస్ట్ ఎక్స్ పీరియన్స్ అయితే ఆడియెన్స్ కి మిగిల్చారు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘విరాటపాలెం-పీసీ మీనా రిపోర్టింగ్’ ఒక డీసెంట్ కథతో కూడిన లైన్ సిరీస్ ని ఎలా తీయకూడదు అనేదానికి మంచి ఉదాహరణగా చెప్పొచ్చు. ఒక్క ఫీమేల్ లీడ్, ఓకే అనిపించే లైన్ తప్ప ఇందులో ప్రతీ అంశమూ ఒక వరస్ట్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తుంది. ఒక పక్క టెక్నీకల్ గా ఇంకోపక్క కథనం పరంగా కూడా దారుణంగా డిజప్పాయింట్ చేస్తాయి. సో మీ విలువైన సమయాన్ని దీనికి కేటాయించి వేస్ట్ చేసుకోకండి.

123telugu.com Rating: 1.5/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు