‘హరిహర వీరమల్లు’ ట్రైలర్.. మేకర్స్ వరస్ట్ ప్లానింగ్స్

‘హరిహర వీరమల్లు’ ట్రైలర్.. మేకర్స్ వరస్ట్ ప్లానింగ్స్

Published on Jun 28, 2025 12:13 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకులు జ్యోతి కృష్ణ అలాగే క్రిష్ జాగర్లమూడి కలయికలో తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రమే “హరిహర వీరమల్లు”. ఈ సినిమా విషయంలో అభిమానులకి మాత్రం కావాల్సినంత డిజప్పాయింట్మెంట్ ని మేకర్స్ ఎప్పటికప్పుడు ఇస్తూనే వస్తున్నారని చెప్పక తప్పదు.

ఎప్పుడో రావాల్సిన సినిమా పవన్ డేట్స్ లేక ఈ ఏడాదికి వచ్చింది అంటే తన షూటింగ్ అయ్యిపోయిన తర్వాత కూడా చిత్ర యూనిట్ నుంచి సరైన క్లారిటీ ఫ్యాన్స్ కే తెలియడం లేదు. అవైటెడ్ గా ఎదురు చూస్తున్న వీరమల్లు ట్రైలర్ పై ఈ వారంలో అప్డేట్ ఇస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు కానీ ఆల్రెడీ వీకెండ్ కి వచ్చి ఇంకొక్క రోజు ఉన్నప్పటికీ కనీసం ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేసే అప్డేట్ కాదు కదా..

కనీసం మినిమమ్ హింట్స్ ఇస్తూ హైప్ ఎక్కించే ప్రయత్నం కూడా మేకర్స్ సోషల్ మీడియా నుంచి కనిపించడం లేదు. ఏదో ఎప్పుడో నామ మాత్రంగా మాత్రమే ఈ సినిమా పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది. ఇప్పటికే సినిమా చాలా ఆలస్యం దానికి తోడు ఈ లేట్ కూడా ఒకటి. ఇవన్నీ మాత్రం అభిమానులకే ఒకింత వరస్ట్ ఎక్స్ పీరియన్స్ గా మారాయి అని చెప్పక తప్పదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు