స్విస్ లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఎవడు

స్విస్ లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఎవడు

Published on May 26, 2013 8:30 AM IST

Yevadu1
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రానున్న తదుపరి సినిమా ‘ఎవడు’. ఈ సినిమా స్విస్ షెడ్యూల్ పూర్తయ్యింది. ఇటీవలే రామ్ చరణ్, శృతి హాసన్ పై జురిచ్, స్విట్జర్ల్యాండ్ లలో ఓ పాటని చిత్రీకరించారు. ‘ ఎవడు సాంగ్ షూట్ పూర్తయ్యింది. ఫిజికల్ గా బాగా కష్టపడిన సాంగ్, మా కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఈ పాటని మీరంతా బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నానని’ శృతి హాసన్ ట్వీట్ చేసింది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అందరూ జూన్ మొదట్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఆడియో కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించి కనువిందు చేయనున్నారు. వీరిద్దరికి సంబందించిన షూటింగ్ కూడా పూర్తయ్యింది. శృతి హాసన్ తో పాటు అమీ జాక్సన్ కూడా సెకండ్ హీరోయిన్ గా కనిపించనుంది. వెన్నెల కిషోర్ ఓ కీ రోల్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్, వైజాగ్లో జరిగింది. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు