ఎవరు విడాకులు తీసుకొన్నా నాతో పెళ్లి అనేవారు – మీనా

ఎవరు విడాకులు తీసుకొన్నా నాతో పెళ్లి అనేవారు – మీనా

Published on Sep 15, 2025 3:40 PM IST

Meena

సీనియర్ హీరోయిన్ మీనా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. తాజాగా ఆమె ‘జయమ్ము నిశ్చయమ్మురా’ కార్యక్రమానికి అతిథిగా హాజరై తన కెరీర్‌, పర్సనల్‌ లైఫ్‌ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది. జగపతి బాబు హోస్ట్‌ గా వ్యవహరిస్తున్న ఈ టాక్‌ షో ‘జీ 5’ లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇంతకీ, మీనా ఏం చెప్పింది అంటే.. ‘చాలామంది నిర్మాతలు ఫ్లాప్‌లలో ఉన్నామని తక్కువ అమౌంట్‌తో సినిమా చేస్తున్నామని నన్ను అడిగేవారు. నేను సరేనని అంగీకరించేదాన్ని. ఆ చిత్రాలు సూపర్‌హిట్‌ అయ్యేవి. తర్వాత నన్ను మర్చిపోయేవారు. ఎప్పుడూ ఇలానే జరిగేది’ అంటూ మీనా చెప్పుకొచ్చింది.

మీనా ఇంకా మాట్లాడుతూ.. ‘కెరీర్‌లో నాకు వరుస అవకాశాలు వస్తున్నప్పుడే, నేను పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత పాప పుట్టిన రెండేళ్లకు మలయాళం సినిమా దృశ్యం కోసం నన్ను సంప్రదించారు. పాపను వదిలి వెళ్లలేక తిరస్కరించాను. వాళ్లు రిక్వెస్ట్ చేశారు. కథ రాసేటప్పుడు నన్ను దృష్టిలోపెట్టుకున్నట్లు చెప్పారు. వేరే వారితో సినిమా చేయలేమన్నారు. దీంతో అంగీకరించాను. ఇక ఎవరు విడాకులు తీసుకొన్నా నాతో పెళ్లి అని రాసేవారు. అలాంటి వార్తల వల్ల నాకు అసహ్యం వేసేది’ అంటూ మీనా చెప్పుకొచ్చింది.

తాజా వార్తలు