‘మిరాయ్’లో ప్రభాస్ వాయిస్ ఓవర్.. అది రియల్..!

‘మిరాయ్’లో ప్రభాస్ వాయిస్ ఓవర్.. అది రియల్..!

Published on Sep 16, 2025 3:00 AM IST

టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘మిరాయ్’లో ప్రత్యేక హైలైట్‌గా నిలిచింది రెబల్ స్టార్ ప్రభాస్ వాయిస్ ఓవర్. పురాణాలు, ఇతిహాసాల వైభవాన్ని వివరిస్తూ కథా నేపధ్యాన్ని చెప్పిన తీరు, ప్రభాస్ అభిమానులను మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. ఆయన తన సొంత సినిమాలకు చెప్పిన డబ్బింగ్‌ కంటే ఇది మరింత బలంగా, ప్రభావవంతంగా ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభాస్ వాయిస్‌లో ఉన్న ప్రత్యేకతే ఈ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌కు అదనపు మేజిక్‌ను జోడించిందని అంటున్నారు.

సాధారణంగా ప్రభాస్ తన సినిమాల్లో డైలాగ్‌లు నెమ్మదిగా, పట్టు పట్టు చెబుతాడని అందరికీ తెలిసిందే. అయితే మిరాయ్ లో ఆయన వాయిస్ ఓవర్ మాత్రం స్పీడ్‌గా వినిపించడంతో, ఇది నిజంగా ప్రభాస్ స్వరమేనా అన్న సందేహాలు కలిగించాయి. సోషల్ మీడియాలో అయితే, ఏఐ టెక్నాలజీ ద్వారా ప్రభాస్ వాయిస్‌ను రీక్రియేట్ చేశారనే ప్రచారం కూడా జోరందుకుంది.

అయితే ఈ రూమర్స్‌పై దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని స్పందించారు. ప్రభాస్ స్వయంగా మిరాయ్ కోసం డబ్బింగ్ చెప్పాడని, వినిపించిన ప్రతి డైలాగ్ కూడా ఆయన గొంతు నుంచే వచ్చిందని స్పష్టం చేశారు. కేవలం టెక్నాలజీ సాయంతో వాయిస్‌లో కొంత స్పీడ్‌ను పెంచామని, దీని వెనుక ఉద్దేశ్యం వాయిస్ ఓవర్ రన్ టైమ్ తగ్గించడం మాత్రమేనని కార్తీక్ తెలిపారు. దీంతో ప్రభాస్ వాయిస్ ఓవర్ విషయంలో ఏఐ ఊహాగానాలకు చెక్ పడింది.

తాజా వార్తలు