‘తుఫాన్’ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం పాలవ్వడంతో చరణ్ కాస్త నిరాశకు గురయ్యాడు. కాకపోతే తన తదుపరి సినిమా ‘ఎవడు’ పై చాలా నమ్మకంగా వున్నాడు. ఇప్పటికే ఆడియో మంచి విజయం సాధించింది
ఈ సినిమా చాలా రోజుల క్రితమే సెన్సార్ పనులను సైతం పూర్తి చేసుకుని 31 జూలై కి ముందుగా సిద్ధమయ్యింది. అయితే రాష్ట్ర రాజకీయ నేపధ్యాల సినిమా వాయిదాపడింది. ఇప్పుడు తాజా సామాచారం ప్రకారం ఈ సినిమా దీపావళికి గానీ, క్రిస్ మస్ కు గానీ విడుదలచేద్దామని ఆలోచిస్తున్నారు
ఈ సినిమాలో శృతిహాసన్ మరియు అమీ జాక్సన్ హీరోయిన్స్. వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకుడు. దిల్ రాజు నిర్మాత. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు