కల్కి నుంచి దీపికా ఔట్.. నాగ్ అశ్విన్ పోస్ట్ చూశారా..?

కల్కి నుంచి దీపికా ఔట్.. నాగ్ అశ్విన్ పోస్ట్ చూశారా..?

Published on Sep 19, 2025 2:00 AM IST

టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడి’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రభాస్ లీడ్ రోల్‌లో నటించాడు. ఇక ఈ సినిమాలోని వెరైటీ కంటెంట్, దాని ఎగ్జిక్యూషన్‌ను ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేశారు.

ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. అయితే, ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఓ సాలిడ్ పాత్రలో నటించింది. కానీ, ఇప్పుడు సీక్వెల్ విషయంలో ఆమె ఈ సినిమాలో నటించడం లేదని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కాగా, తాజాగా నాగ్ అశ్విన్ తన ఇన్‌స్టాలో ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ పెట్టాడు.

‘నువ్వు గతంలో ఏం జరిగిందో మార్చలేవు.. కానీ, భవిష్యత్తులో ఏం జరగాలో ఎంచుకోగలవు..’ అంటూ ఓ స్టోరీ పెట్టాడు. దీంతో అభిమానులు ఈ పోస్ట్ కి కారణం ఏమిటా అని చర్చిస్తున్నారు. మరి నిజంగానే దీపికా పదుకొనేని ఉద్దేశించి ఈ పోస్ట్ వేశారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు