జూన్ 20 తో ముగియనున్న ‘ఎవడు’

జూన్ 20 తో ముగియనున్న ‘ఎవడు’

Published on May 27, 2013 1:32 PM IST

Yevadu1

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘ఎవడు’ సినిమా షూటింగ్ త్వరలో పుర్తికానుంది. ఈ సినిమా షూటింగ్ జూన్ 20వరకు పూర్తవుతుందని సమాచారం. ఈ సినిమా జూలైలో విడుదలయ్యేందుకు సిద్దమవుతోంది. ఈ సినిమాలో చరణ్ యాక్షన్ పాత్రలో కనిపించనున్నాడు. చరణ్ సరసన శృతి హాసన్, అమీ జాక్సన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుందని సమాచారం. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని సాదిస్తుందని వంశీ పైడిపల్లి చాలా నమ్మకంగా వున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ లు అతిధి పాత్రలో కనిపించనున్నారు.

తాజా వార్తలు