మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ ‘ఎవడు’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఒక్క ఏపిలోనే కాకుండా యుఎస్ లో కూడా బాగానే ప్రదర్శించబడుతోంది. ఓవర్సీస్ లో మొదటి వారం టికెట్ ధరలను ఇది వరకు అందించాం. రెండవ వారంలో అక్కడ టికెట్ ధరలు తగ్గనున్నాయి. రెండవ వారం నుంచి ఎవడు టికెట్ ధర 10 డాలర్లు మాత్రమే.
శృతి హాసన్, అమీ జాక్సన్ జంటగా నటించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ – కాజల్ అగర్వాల్ లు కీలక పాత్రలు పోషించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత.