‘విజయ్ దేవరకొండ’కి విలన్ గా సీనియర్ హీరో ?

‘విజయ్ దేవరకొండ’కి విలన్ గా సీనియర్ హీరో ?

Published on Sep 23, 2025 1:02 AM IST

Vijay-Devarakonda

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇటీవల గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో ‘కింగ్డమ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఐతే, ఇప్పుడు విజయ్‌ చేతిలో మరో రెండు సినిమాలున్నాయి. వాటిలో రాహుల్‌ సంకృత్యాన్‌ తెరకెక్కిస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా ఒకటి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలు అయింది. ఇక ఈ సినిమాతో పాటు యువ దర్శకుడు రవి కిరణ్‌ కోలా తెరకెక్కించనున్న ‘రౌడీ జనార్దన’ సినిమా కూడా పట్టాలెక్కేందుకు రెడీ అవుతుంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు నుంచి షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది.

ఐతే, తాజాగా ఈ సినిమాలో నటించే ప్రతినాయకుడి పాత్ర గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలుస్తోంది. సీనియర్‌ హీరో రాజశేఖర్‌ ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు విలన్ గా కనువిందు చేయనున్నట్లు టాక్. పైగా ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుందట. అలాగే, రాజశేఖర్ లుక్‌ కూడా మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుందట. ఇప్పటికే లుక్‌ టెస్ట్‌ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. ఇక ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్‌ నటించనుంది.

తాజా వార్తలు