కన్నడ హీరో రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తూ నటించిన ప్రెస్టీజియస్ చిత్రం ‘కాంతార చాప్టర్ 1’ థియేట్రికల్ ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. ఈ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్‌పై చూద్దామా అని అభిమానులు ఆశగా చూస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2, 2025న పలు భాషల్లో భారీగా విడుదల కాబోతోంది.
ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక ఈ చిత్రానికి 168 నిమిషాలు (2 గంటల 48 నిమిషాలు) రన్‌టైమ్‌ను మేకర్స్ లాక్ చేశారు. కథలో కాన్ఫిడెంట్‌గా ఉన్న చిత్ర యూనిట్ ఈ రన్‌టైమ్‌తో హ్యాపీగా ఉన్నారు.
రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా గుల్షన్ దేవయ్య ప్రతినాయకుడిగా కనిపించనున్న ఈ సినిమాలో జయరాం, రాకేష్ పూజారి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ నిర్మాణంలో విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.