టాలీవుడ్ అందగాడు మహేష్ సరసన నటించాలనే కోరిక ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ఇప్పుడు ఆ జాబితాలోకి సిమ్రాన్ కౌర్ కూడా చేరింది. ఈ భామ మనోజ్ తో జంటగా ‘పోటుగాడు’ సినిమాలో నలుగురు హీరోయిన్లలో ఒకరిగా తెలుగు తెరకు పరిచయం కానుంది. ఈ సినిమాకు ముందు సిమ్రాన్ 2008లో ఫెమీన మిస్ ఇండియా పీజెంట్ అవార్డును సొంతం చేసుకుంది.
తాను సరైన సమయంలో సరైన మార్గంలో ఉన్నానని భావిస్తున్న ఈ భామకు మహేష్ తో నటించడం అంటే చాలా ఇష్టమట. ఒకసారి నమ్రతాను కూడా కలిసింది. మహేష్ సరసన నటించే అవకాశం రావడమే గొప్ప విషయం అని తన మనోగతాన్ని తెలిపింది. అంతే కాక మన తెలుగు సినిమా రంగం పద్ధతులు, అలవాట్లు తనకు ఎంతగానో నచ్చాయని తెలిపింది.