సైయారా.. అపేది ఎవరురా..?

సైయారా.. అపేది ఎవరురా..?

Published on Sep 18, 2025 2:00 AM IST

Saiyaara

బాలీవుడ్‌లో లేటెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘సైయారా’ బాక్సాఫీస్ వద్ద రూ.550 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కమర్షియల్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు నేటి యూత్ బాగా కనెక్ట్ కావడంతో ఈ రిజల్ట్ వచ్చిందని పలువురు సీనియర్ సినీ క్రిటిక్స్ కామెంట్ చేశారు. అయితే ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా సత్తా చాటుతోంది.

మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ డ్రామా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో విడుదలైన మొదటి వారంలోనే ‘సైయారా’ గ్లోబల్ స్థాయిలో అత్యధికంగా వీక్షించబడిన నాన్-ఇంగ్లీష్ ఫిల్మ్‌గా నిలిచింది. జర్మన్ ఎరోటిక్ థ్రిల్లర్ ఫాల్ ఫర్ మీ, నెట్‌ఫ్లిక్స్ హిందీ ఒరిజినల్ ఇన్‌స్పెక్టర్ జెండె సినిమాలను అధిగమించి, ప్రపంచవ్యాప్తంగా టాప్ పొజిషన్‌లోకి ఎక్కింది.

అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా నటించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో 9.3 మిలియన్ గంటల వ్యూయర్‌షిప్ సాధించడం విశేషమనే చెప్పాలి. మరి ఈ చిత్రం మున్ముందు ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

తాజా వార్తలు