సుమ అడ్డాలో తెలుసు కదా.. మామూలుగా ఉండదుగా..?

సుమ అడ్డాలో తెలుసు కదా.. మామూలుగా ఉండదుగా..?

Published on Sep 18, 2025 12:00 AM IST

సెలబ్రిటీ స్టైలిస్ట్ నీరజా కోనా దర్శకురాలిగా పరిచయం అవుతున్న చిత్రం ‘తెలుసు కదా’. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజ్ అయిన మల్లికా గంధా పాట, టీజర్‌కు మంచి స్పందన లభించింది.

ఇటీవల షూటింగ్ పూర్తయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రమోషన్లలో భాగంగా టీమ్ ఈటీవీ సుమా అడ్డా షోలో పాల్గొంది. ఇందులో నీరజా కోనా, ప్రొడ్యూసర్ కృతి ప్రసాద్, హీరో సిద్ధు, రాశి ఖన్నా, సుమ, వైవా హర్ష కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఎపిసోడ్ త్వరలోనే టెలికాస్ట్‌కు రానుంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీ.జి. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 17న దీపావళి కానుకగా గ్రాండ్ రిలీజ్ కానుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు