OG : ఏపీలో టికెట్ రేట్ల పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

OG : ఏపీలో టికెట్ రేట్ల పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Published on Sep 17, 2025 8:01 PM IST

OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజి కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. వచ్చే వారం(సెప్టెంబర్ 25) రిలీజ్ కానున్న ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు సుజిత్ డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందింది.

ఇక ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్ర టికెట్ రేట్ల పెంపుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ఓజి చిత్ర టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. ఓజి చిత్రం బెనిఫిట్ షోలు సెప్టెంబర్ 25న అర్ధరాత్రి 1 గంటకు ప్రదర్శించేందుకు పర్మిషన్ ఇవ్వగా.. ఒక్క టికెట్ రేటు రూ.1000/ గా ఫిక్స్ చేసింది.

రిలీజ్ రోజు(సెప్టెంబర్ 25) మొదలు అక్టోబర్ 4 వరకు ఈ చిత్రం టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.125, మల్టీప్లెక్స్‌లో రూ.150 మేర టికెట్ రేట్లు అదనంగా పెంచుకునేందుకు పర్మిషన్ ఇస్తూ అక్కడి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ టికెట్ రేట్ల పెంపుతో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్స్ రాబట్టడం ఖాయమని సినీ సర్కిల్స్ అంచనా వేస్తున్నాయి.

ఇమ్రాన్ హష్మి, ప్రియాంక మోహన్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు