మిరాయ్ ఎఫెక్ట్.. ‘ది రాజా సాబ్’ విజువల్స్ పై మరింత హోప్స్!

ప్రస్తుతం మన తెలుగు సినిమా నుంచి వస్తున్న సినిమాలు క్వాలిటీ పరంగా దాదాపు సాలిడ్ కంటెంట్ తోనే దింపుతున్నారు. ఒకటీ రెండు సినిమాలు పక్కన పెడితే మిగతా సినిమాలు తక్కువ బడ్జెట్ లో కూడా వండర్స్ చేస్తున్నాయి. అలా వచ్చిన లేటెస్ట్ సినిమానే “మిరాయ్”. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కి మంచి రెస్పాన్స్ దక్కుతుంది.

థియేటర్స్ లో చూపించిన విజువల్ ఫీస్ట్ మరింత ప్లస్ గా మారడంతో ఇపుడు ఇదే నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి రాబోతున్న నెక్స్ట్ విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యత చిత్రం ది రాజా సాబ్ పట్ల ప్రభాస్ ఫ్యాన్స్ మంచి హోప్స్ ఇపుడు పెట్టుకుంటున్నారు. తేజ సజ్జ అండ్ టీం మిరాయ్ వి ఎఫ్ ఎక్స్ విషయంలో ముందు నుంచీ మంచి కాన్ఫిడెన్స్ గా ఉన్నారు.

పీపుల్ మీడియా వారికి సెపరేట్ గా వి ఎఫ్ ఎక్స్ టీం కూడా ఉంది. వారి కష్టం మిరాయ్ లో కనిపించింది. సో నెక్స్ట్ వచ్చే భారీ ప్రాజెక్ట్ ది రాజా సాబ్ లో ఇదే రేంజ్ అవుట్ పుట్ కనిపిస్తే ఆ మధ్య బాలీవుడ్ నిర్మాత ఎవరో చెప్పినట్టు హ్యారీ పోటర్ రేంజ్ విజువల్స్ అనేది నిజమే అని చెప్పొచ్చు. మొత్తానికి మాత్రం రాజా సాబ్ విజువల్స్ పరంగా కొత్త అంచనాలు ఇపుడు మొదలయ్యాయి.

Exit mobile version