“కోర్ట్” ‘హిట్’..3 చూడొచ్చు అయితే..!

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి మోస్ట్ టాలెంటెడ్ హీరోస్ లో నాచురల్ స్టార్ నాని కూడా ఒకరు. నాని హీరోగా చేస్తున్న ప్రతీ సినిమా కూడా ఇపుడు మినిమమ్ గ్యారెంటీ అయ్యిపోయింది. ఇక హీరో గానే కాకుండా నిర్మాతగా కూడా టాలీవుడ్ లో నాని అద్భుతంగా రాణిస్తున్నాడు. మరి తాను నిర్మాణం వహించిన లేటెస్ట్ చిత్రమే “కోర్ట్”. యంగ్ హీరో ప్రియదర్శి పులికొండ నటించిన ఈ సినిమా అనుకున్నట్టే ‘హిట్’ అయ్యింది.

అన్నట్టు ఇక్కడ హిట్ అంటే నాని కామెంట్స్ ఇపుడు గుర్తొస్తున్నాయి. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో కోర్ట్ కాని ఎవరికీ నచ్చకపోతే తన రానున్న “హిట్ 3” సినిమా ఎవరూ చూడొద్దు అంటూ నాని ఓపెన్ గానే సవాల్ చేసాడు. కానీ ఇపుడు సీన్ కట్ చేస్తే కోర్ట్ సూపర్ హిట్ అయ్యి తన హిట్ 3 సినిమా కూడా మినిమమ్ గ్యారెంటీ అనే రేంజ్ లో ఉండబోతుంది అని క్లియర్ అయ్యింది. దీనితో నాని కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉంది అనేది అర్ధం చేసుకోవచ్చు. ఇక హిట్ 3 అయితే ఈ మే 1న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version