టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల క్రేజ్ ప్రస్తుతం ఏ రేంజ్‌లో ఉందో అందరికీ తెలిసిందే. వరుసబెట్టి సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ చిన్నా, పెద్ద సినిమా తేడా లేకుండా సైన్ చేస్తోంది. ఇక కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ పాగా వేసేందుకు ఈ అమ్మడు రెడీ అయింది. హీరో కార్తీక్ ఆర్యన్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తూ బాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీకి రెడీ అయింది.
అయితే, శ్రీలీల ‘పుష్ప-2’ సినిమా ‘కిస్సిక్’ ఐటెం సాంగ్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ పాట ఎంతటి పాపులారిటీని సంపాదించిందో మనం చూశాం. ఇక ఆ పాట తర్వాత అమ్మడికి అలాంటి ఆఫర్స్ చాలానే వచ్చాయట. కానీ, శ్రీలీల తనకున్న సినిమాల కారణంగా వాటిని రిజెక్ట్ చేసింది. అయితే, ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ కోసం శ్రీలీల మరోసారి స్పెషల్ సాంగ్‌లో చిందులేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
అక్కినేని నాగచైతన్య, విరూపాక్ష ఫేమ్ దర్శకుడు కార్తీక్ దండు కాంబినేషన్‌లో ఓ మిస్టిక్ థ్రిల్లర్ చిత్రం తెరకెక్కుతోంది. అత్యంత భారీ బడ్జె్ట్‌తో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందట. అయితే, ఈ సాంగ్‌లో చిందులేసేందుకు శ్రీలీలను చిత్ర యూనిట్ అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్‌కు శ్రీలీల ఓకే చెబుతుందా లేదా అనేది వేచి చూడాలి.