‘పెద్ది’ నుంచి రెండో ట్రీట్ కి సిద్ధమా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “పెద్ది”. గట్టి అంచనాలు ఉన్న ఈ సినిమా మంచి అంచనాలు సెట్ చేసుకొని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఇది వరకే సినిమా నుంచి వచ్చిన రామ్ చరణ్ ఫస్ట్ లుక్ సహా పెద్ది ఫస్ట్ షాట్ నేషనల్ వైడ్ గా మంచి హైలైట్ అయ్యాయి.

ఇక మెగా అభిమానులకి రామ్ చరణ్ అభిమానులకి మరో సాలిడ్ ట్రీట్ వచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మేకర్స్ రీసెంట్ గానే రామ్ చరణ్ పై మరో లుక్ ని లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఇపుడు ఈ లుక్ పరంగా రామ్ చరణ్ పై రెండో ఫస్ట్ లుక్ ని విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ కొన్ని రోజుల్లోనే లేదా వినాయక చవితి కానుకగా ఆ లుక్ వచ్చే ఛాన్స్ ఉందట. సో దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version