కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన చిత్రమే “కూలీ”. స్క్రిప్ట్ పరంగా ఆడియెన్స్ ని డిజప్పాయింట్ చేసిన ఈ సినిమా ఈ టాక్ తో కూడా భారీ వసూళ్లు సొంతం చేసుకుంటుంది. ఇక ఈ సినిమా తర్వాత లోకేష్ నుంచి ఖైదీ 2 అంతా ఆశిస్తే దీని ప్లేస్ లో రజినీకాంత్, కమల్ హాసన్ ల భారీ మల్టీస్టారర్ తాను ప్లాన్ చేస్తున్నట్టు ఓ టాక్ వైరల్ గా మారింది. దీనితో ఖైదీ 2 వాయిదా పడింది అని తెలిసింది.
కానీ ఇందుకు మరో కారణం కూడా ఉందని తెలుస్తుంది. ఖైదీ 2 కి భారీ హైప్ ఉంది. మరి ఆ హైప్ ని లోకేష్ క్యాష్ చేసుకోవాలి అనుకున్నాడు అట. కూలీ సినిమాకి 50 కోట్ల పారితోషికం అందుకున్నట్టు తానే చెప్పాడు. మరి అంతకు మించి హైప్ ఉన్న ఖైదీ 2 చేయాలంటే 75 కోట్ల మొత్తం అడిగాడట. అక్కడ హీరోకి కూడా అంత లేకపోవడం ఆశ్చర్యకరం అందుకే ఈ సినిమా వెనక్కి వెళ్లినట్టు కొత్త పుకారు మొదలైంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.