ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’

Hari Hara Veera Mallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా క్రిష్, జ్యోతిక్రిష్ణ లు తెరకెక్కించిన భారీ పీరియాడిక్ చిత్రమే “హరిహర వీరమల్లు”. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ భారీ చిత్రం విడుదల అయ్యాక మాత్రం వాటిని రీచ్ కాలేకపోయింది. ఇలా నెల లోపే ఓటీటీ లోకి స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

ఇక ఈ సినిమా హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. నిన్న వారు కేవలం మూడు భాషల్లో తెలుగు, తమిళ్, మళయాళ భాషల్లో మాత్రమే అనౌన్స్ చేసారు. కానీ నేడు మాత్రం ఈ సినిమా మొత్తం నాలుగు భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

ఈ సినిమా ఒక్క కన్నడ మినహా మిగతా పాన్ ఇండియా భాషల్లో వచ్చేసింది. సో వీరమల్లు సినిమాని ఇప్పుడు చూడాలి అనుకునేవారు ప్రైమ్ వీడియోలో ట్రై చేయవచ్చు. హిందీ వెర్షన్ సెపరేట్ గా స్ట్రీమ్ అవుతుంది. మరి కన్నడ ఎందుకు స్కిప్ చేశారో తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు అలాగే ఏ ఎం రత్నం నిర్మాణం వహించారు.

Exit mobile version