కన్ఫ్యూజ్ చేస్తున్న ‘మాస్ జాతర’ రిలీజ్.. ఆందోళనలో ఫ్యాన్స్!

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మాస్ జాతర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు భాను బోగవరపు డైరెక్ట్ చేస్తుండగా పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోంది.

అయితే, ఈ చిత్రాన్ని వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న రిలీజ్ చేస్తామని గతంలోనే మేకర్స్ వెల్లడించారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిందని ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత, మళ్లీ ఈ సినిమా రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు ఉండబోదంటూ మరో వార్త చక్కర్లు కొట్టింది.

కానీ, ఇప్పుడు సినీ సర్కిల్స్‌లో ఈ సినిమా వాయిదా తప్పదనే వార్త వినిపిస్తోంది. ఔట్‌పుట్ విషయంలో మేకర్స్ శాటిస్ఫై అయ్యాకే ఈ సినిమాను రిలీజ్ చేయాలని వారు భావిస్తున్నారట. మరి ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఇంత కన్ఫ్యూజన్ ఏమిటని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version