పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే యువకుల్లో, సినిమా ప్రేమికుల్లో మంచి క్రేజ్ ఉంది. పవర్ ప్యాక్ యాక్షన్ రోల్స్, ఎంటర్టైనింగ్ సినిమాలు చేయడంలో పవన్ కి మంచి పేరుంది. ఇటీవలే పవన్ అందుకున్న బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ‘గబ్బర్ సింగ్’ కూడా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వేరే జోనర్ పై దృష్టి పెడుతున్నారు. మేము విన్న సమాచారం ప్రకారం పవన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలతో మెప్పించాలనుకుంటున్నాడు. ఈ జోనర్ లో ఓ మంచి హిట్ అతనా ఖాతాలో వేసుకోవాలని ఆశిస్తున్నాడు.
ఆయన ఆశ రాబోయే ‘అత్తారింటికి దారేది’ సినిమాతో నెరవేరుతుందని భావిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చాలా బాగా వస్తోందని అంటున్నారు. సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫుల్ ఎంటర్టైన్ చేసే పాత్రలో కనిపిస్తాడని సమాచారం. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాకి బివిఎస్ఎస్ ప్రసాద్ నిర్మాత.