2026లో ఎవరికీ ఆ ఛాన్స్ ఇవ్వను – నాగ వంశీ

2026లో ఎవరికీ ఆ ఛాన్స్ ఇవ్వను – నాగ వంశీ

Published on Dec 1, 2025 10:02 PM IST

nagavamsi

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నాగ వంశీ గత కొన్ని చిత్రాలతో ఫెయిల్యూర్ ఎదుర్కొంటూ వస్తున్నారు. దీంతో సోషల్ మీడియా లో ఆయన పై నెగటివ్ ట్రోలింగ్ ఎక్కువగా జరిగింది. అయితే ఈ సారి ఓ పక్కా లవ్ స్టోరీ తో రాబోతున్నారు ఈ నిర్మాత.

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ఆదిత్య హాసన్ తెరక్కెకిస్తున్న లేటెస్ట్ చిత్రానికి ‘ఎపిక్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ అనౌన్స్మెంట్ సందర్బంగా నాగ వంశీ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

2026లో తాను చేసే సినిమాలతో అందరికీ ఆన్సర్ చెబుతానని.. తన పై ఏ ఒక్కరికి కామెంట్ చేసే అవకాశం ఇవ్వనని.. ట్రోల్లర్స్ ని కూడా సైలెంట్ చేస్తానని ఆయన అన్నారు. దీంతో మరోసారి నాగ వంశీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తాజా వార్తలు