అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకోనున్నాడా?

అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకోనున్నాడా?

Published on May 28, 2013 4:21 PM IST

Iddarammayilatho
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ‘ఇద్దరమ్మాయిలతో’ ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలకానుంది. ఈ సినిమాని పూర్తి స్టైలిష్ గా తెరకెక్కించారని సమాచారం. ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. అల్లు అర్జున్ నటించిన చివరి సినిమా ‘జులాయి’ మంచి హిట్ ను సాదించింది. ఇప్పుడు ‘ఇద్దరమ్మాయిలతో’ మరో హిట్ ను సాదించనున్నాడా?. ఈ శుక్రవారం విడుదలకానున్న ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద భారీ హిట్ ను సాదిస్తుందని భావిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాలోని పాటలకి రాకింగ్ సంగీతాన్నిఅందించాడు. అమలా పాల్, కేథరిన్ హీరోయిన్స్ గా నటించారు. ‘బాద్షా’ తరువాత ఈ వేసవిలో విడుదలవుతున్న భారీ సినిమా ఇది. బండ్ల గణేష్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే బారీ విజయాన్ని సాదిస్తుందని నమ్మకంగా ఉన్నాడు.

తాజా వార్తలు