టాలీవుడ్‌లో తెరకెక్కిన క్రేజీ సీక్వెల్ చిత్రం ‘అఖండ 2’ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరికొద్ది గంటల్లో రిలీజ్ కావాల్సి ఉన్న సినిమాను ఊరిస్తూ, ఊరిస్తూ ఏకంగా వాయిదా వేశారు మేకర్స్. దీంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాలయ్య లాంటి స్టార్ హీరో సినిమాను ఇలా చివరి నిమిషంలో వాయిదా వేయడం ఏమిటని అభిమానులు, సినీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, నిర్మాణ సంస్థకు చెందిన కొన్ని సమస్యల కారణంగా ఈ సినిమా వాయిదా పడినట్లు సినీ సర్కిల్స్ టాక్. అన్నీ సజావుగా ఉన్నప్పుడే సినిమాను రిలీజ్‌కు తీసుకురావాల్సింది అంటూ అభిమానులు మండిపడుతున్నారు.
మరి రిలీజ్ వరకు వచ్చి ఆగిపోయిన ‘అఖండ 2’ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుంది.. రిలీజ్ అయ్యాక ఎలాంటి ప్రభావం ఆ సినిమాపై పడుతుంది.. ఆ సినిమా ఫలితం ఎలా ఉండబోతుంది.. అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.


