ప్రభాస్ సినిమాలో అజయ్ దేవ్‌గణ్.. నిజమేనా ?

నేషనల్ స్టార్ గా ప్రభాస్ బాలీవుడ్ బడా ద‌ర్శ‌కుడు సంజ‌య్ రౌత్ తో “ఏ- ఆది పురుష్” అనే మరో భారీ సినిమాని ప్ర‌క‌టించి.. ఆ సినిమా షూటింగ్ కోసం డిసెంబర్ లో డేట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మెలుహ పాత్రల శైలిలో ప్రభాస్ పాత్ర సాగుతోందని తెలుస్తోంది. మెలూహ నాయకుడిగా అంటే మనిషి రూపంలో ఉండే నాగుల జాతికి సంబంధించిన నాయకుడిగా అన్నమాట. రీసెంట్ గా రిలీజైన పోస్టర్ లో కూడా ఒక లుక్ అచ్చం మెలూహ నాయకుడి త‌ర‌హా లుక్ లోనే ప్రభాస్ కనిపిస్తున్నాడు.

కాగా మెలుహా ల్యాండ్స్ లో సాగే ఈ క‌థ‌లో శివుని పాత్రలో అజయ్ దేవ్‌గణ్ ను విజువ‌ల్ వండ‌ర్ గా కూడా చూపించబోతున్నారని కూడా బాలీవుడ్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదని తెలుస్తోంది. దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం ప్రభాస్ బాడీ పెంచనున్నాడట. సినిమాలో ప్రభాస్ ఎనిమిది అడుగుల అజానబాహుడిగా కనిపించబోతున్నాడని.. అందుకే ప్రభాస్ ప్రస్తుతం తన బాడీని పెంచే సన్నాహాల్లో ఉన్నాడని తెలుస్తోంది.

కాగా బాలీవుడ్ సంస్థ టీసిరీస్ ఏ బాలీవుడ్ స్టార్ తోనో ఇలాంటి భారీ సినిమాను చేయకుండా, సౌత్ హీరో అయిన ప్రభాస్ తో చేయడం నిజంగా విశేషమే. అన్నట్టు ఈ సినిమాని 3డి విజువ‌ల్ గ్రాఫిక్స్ తో ఒక మ‌హ‌దాద్భుతంగా తెర‌కెక్కించి దేశంలోని అన్ని భాష‌లతో పాటు విదేశాల్లోనూ భారీగా రిలీజ్ చేయనున్నారు.

Exit mobile version