అభిజీత్ మరోసారి సెన్సేషన్ ను నమోదు చేస్తాడా.?

మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ స్మాల్ స్క్రీన్ పై ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. మరి అలాగే ప్రతీ సీజన్లో కూడా ఆడియెన్స్ కు ఒక సరైన హీరోనే దొరుకుతున్నాడు. మరి అలా గత నాలుగో సీజన్ కు కూడా ఒక సరైన హీరో దొరికాడు అతడే అభిజీత్..తనదైన గేమ్ మరియు వ్యక్తిత్వంతో మిస్టర్ పర్ఫెక్ట్ గా నిలిచి బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ వార్ వన్ సైడ్ చేసాడు.

అయితే ఈ షో ద్వారా మంచి క్రేజ్ ను తెచ్చుకున్న ఈ కంటెస్టెంట్ మూలానే ఫైనల్స్ ఎపిసోడ్ కు కూడా భారీ స్థాయి టీఆర్పీ రావడంలో ఒక ప్రధాన కారణం అయ్యింది. అయితే మరి అక్కడ నుంచి అభిజీత్ మళ్ళీ ఏ ఇంటర్వ్యూ లోనూ సినిమా చేస్తున్నట్టుగా కూడా అప్డేట్ రాలేదు. అయినప్పటికీ కూడా అభిజీత్ క్రేజ్ ఇంకా చెదరలేదు.

మరి మొత్తానికి మళ్ళీ ఈరోజు స్టార్ మా లో ప్రసారం కానున్న “బిగ్ బాస్ ఉత్సవం” ప్రోగ్రాంతో గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. దీనితో అభిజీత్ రాకపై మళ్ళీ అంతే స్థాయి హైప్ నెలకొంది. దీనితో మరి మళ్ళీ ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హంగామా ఏమో కానీ అభిజీత్ హవా గట్టిగానే కనిపించేలా ఉందని చెప్పాలి. మరి అంతే కాకుండా ఈ ఎపిసోడ్ కు కూడా రేటింగ్ ఎలా వస్తుంది అన్నది కూడా ఆసక్తిగా మారింది.

Exit mobile version