తమిళంలో కార్తి చేస్తున్న చిత్రం “బిరియాని”లో రిచా గంగోపాధ్యాయ్ నటించాల్సి ఉండగా ఆ స్థానంలో ప్రస్తుతం హన్సిక నటిస్తుంది. వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వార్త వెలువడి ఒక్క రోజు తరువాత రిచా ఈ వార్తని దృవీకరించారు అంతే కాకుండా కారణం కూడా బయటపెట్టారు. చిత్రంలో తను సంతకం చేసిన తరువాత చేసిన మార్పులు నచ్చక దీని గురించి వెంకట్ ప్రభు తో చర్చించి సామరస్యంగా ఈ చిత్రం నుండి తప్పుకున్నట్టు తెలుస్తుంది. గతంలో ఇలానే చాలా తెలుగు చిత్రాలను కథ నచ్చక లేదా తన పాత్ర నచ్చక వదులుకున్నారు అని పుకార్లు ఉన్నాయి. చూస్తుంటే ఈ భామ చిత్రాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. తెలుగులో ఈ భామ చివరిగా జనవరి 2011లో విడుదల అయిన “మిరపకాయ్” చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఈ భామ “మిర్చి”,”సార వచ్చారు”, “ఇద్దరమ్మాయిలతో” మరియు “భాయ్” చిత్రాలలో నటిస్తుంది.