టాలీవుడ్‌లో హారర్ జోనర్ చిత్రంగా ‘కిష్కింధపురి’ మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేస్తున్నాడు. ప్యూర్ హారర్ ఎలిమెంట్స్‌నే అందిస్తూ ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమైన ఈ చిత్ర ప్రమోషన్స్‌లో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా ఓ బోల్డ్ స్టేట్మెంట్ చేశాడు.
ఈ సినిమాలో హారర్ అంశాలు పుష్కలంగా ఉంటాయని.. అవే ఈ సినిమాకు ఆయువుపట్టు అని ఆయన అన్నాడు. ఈ సినిమా మొదలైన పది నిమిషాల తర్వాత ప్రేక్షకులు సినిమాలో మునిగిపోతారని.. అలా కాకుండా ఏ ఒక్కరైనా ఫోన్ వాడితే తాను సినిమాలు చేయడం మానేస్తానంటూ బెల్లంకొండ శ్రీనివాస్ ఓ ఇంటర్వ్యూలో కామెంట్ చేశాడు.
మరి నిజంగానే కిష్కింధపురి చిత్రం చూస్తున్న ప్రేక్షకులు థియేటర్లలో ఫోన్ చూడరా.. ఒకవేళ వారు ఫోన్ చూస్తే, నిజంగానే ఈ హీరో సినిమాలు మానేస్తాడా.. అనేది సెప్టెంబర్ 12న రిలీజ్ అవుతున్న సినిమా రిజల్ట్ చెబుతుంది.