ఓటీటీలో రెండు వారాలుగా అదరగొడుతున్న ‘కింగ్డమ్’

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన రీసెంట్ మూవీ ‘కింగ్డమ్’ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ రివెంజ్ డ్రామాగా ఈ సినిమా వచ్చింది. విజయ్ సరికొత్త లుక్ కూడా ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యేలా చేసింది. కానీ, ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర నెగెటివ్ రెస్పాన్స్ దక్కింది.

దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చింది. ఈ చిత్రానికి ఓటీటీలో మాత్రం సాలిడ్ రెస్పాన్స్ దక్కుతోంది. గత రెండు వారాలుగా ఇండియాలో ఎక్కువ మంది చూసిన సినిమాగా ‘కింగ్డమ్’ నిలిచిందని ఓర్మాక్స్ మీడియా వెల్లడించింది.

గత రెండు వారాలుగా ఈ సినిమాకు 5.9 మిలియన్ వ్యూస్ దక్కినట్లు తెలిపింది. ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటించగా, సత్యదేవ్ కీలక పాత్రలో నటించాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version